Sunday Fundayలో స్టాల్స్‌కు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-10-14T16:59:46+05:30 IST
ప్రతీ ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫన్‌డేలో ధరలను కట్ట
ఏదైనా ఎమ్మార్పీకే విక్రయం
స్థానికుల ప్రదర్శనలకు అనుమతి
హైదరాబాద్ సిటీ: ప్రతీ ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫన్‌డేలో ధరలను కట్టడి చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే నామమాత్రపు రుసుముతో వ్యాపారులు స్టాల్స్ పెట్టుకునే అవకాశం కల్పించనున్నారు. విక్రేతలు నాణ్యతా ప్రమాణాలను పాటించడంతో పాటు ప్యాకింగ్ వస్తువులను ఎమ్మార్పీకి విక్రయించాలని, ఫుడ్ స్టాల్స్, హస్తకళలు, చేనేతవస్ర్తాల విక్రయ స్టాల్స్ వద్ద ధరల జాబితాను ప్రదర్శించాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ధేశించారు. స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారు తమ ఉత్పత్తులు, వాటి ధరల వివరాలను ea2ps-maud@telangana.gov.in, hciphmda@gmail.com. మెయిల్ చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. లేదా బోట్స్ క్లబ్ సమీపంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ కార్యాలయంలో ప్రతీ సోమ, మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి ప్రతీ విక్రేతకు వరుసగా రెండు ఆదివారాలను సండే ఫన్‌డే ఈవెంట్‌లో స్టాల్‌ను కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎంపిక చేస్తామని ప్రకటించారు. కళారూపాలను ప్రదర్శించాలనుకునే సంస్థలు, వ్యక్తులు తమ అభ్యర్థనలను పంపాలని సూచించారు.