వివేకా హత్య కేసులో.. సునీల్‌ కుమార్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-04T08:48:00+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మంగళవారం గోవాలో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో

వివేకా హత్య కేసులో.. సునీల్‌ కుమార్‌ అరెస్టు

గోవా కోర్టులో హాజరుపరచిన సీబీఐ

ట్రాన్సిట్‌ రిమాండ్‌తో.. ప్రత్యేక వాహనంలో కడపకు

నేడు కోర్టు ముందుకు సునీల్‌?


కడప, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మంగళవారం గోవాలో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ద్వారా ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకుని.. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా ప్రత్యేక వాహనంలో కడపకు తరలించినట్లు తెలిసింది. కడప కేంద్ర కారాగారం అతిఽథి గృహంలో సునీల్‌తో పాటు వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరితోపాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించారు.  నలుగురినీ మార్చిమార్చి విచారించినట్లు సమాచారం. సునీల్‌ను బుధవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందంటున్నారు. మిగతా ముగ్గురినీ కూడా హాజరు పరుస్తారో లేదో తెలియరాలేదు. సునీల్‌ వైసీపీలో కీలక కార్యకర్త అన్న సంగతి తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌. సోదరుడు కిరణ్‌ యాదవ్‌. వీరి స్వగ్రామం కడప జిల్లా పులివెందుల మండలం మోటనూతలపల్లె. అనంతపురం జిల్లాలోని ఓ లిక్కర్‌ పరిశ్రమలో కృష్ణయ్య పనిచేస్తూ అక్కడే ఉండేవారు. 2017లో కృష్ణయ్య కుటుంబంతో పులివెందుల వచ్చారు.


వివేకా ఇంటికి సమీపంలో భాకరాపురం రాముల గుడి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. వివేకాతో సునీల్‌కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని, నిత్యం ఆయన వెంటే ఉండేవారని చెబుతున్నారు. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సునీల్‌, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్‌మన్‌ రంగయ్యను చాలా సార్లు విచారించాక గత నెల 23న జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎదుట హజరు పరిచి వాంగ్మూలం ఇప్పించారు. అదే రోజు రాత్రి రంగయ్య పులివెందులలో స్థానికులు, మీడియాతో మాట్లాడారు. ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌ పేర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే విచారణ పేరుతో సీబీఐ అధికారులు వేధిస్తున్నారని సునీల్‌ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీబీఐ బృందాలు కడప, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల గాలించాయి. గోవాలో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారమే అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వాచ్‌మన్‌ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు వేగం పెంచిందని అంటున్నారు. వివేకా 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.


ఆయన కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు నిరుడు మార్చి 11న సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అదే ఏడాది జూలై 18న దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పలువురు దర్యాప్తు అధికారులు కరోనా బారినపడడంతో విచారణకు విరామం ఇచ్చారు. ఈ జూన్‌లో రెండో విడత దర్యాప్తు మొదలుపెట్టారు. కడప కేంద్ర కారాగారం అతిఽథి గృహం, పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో 40 మందికిపైగా అనుమానితులను విచారించారు. మంగళవారం నాటికి వారి విచారణ 59వ రోజుకు చేరుకుంది.


హంతకులెవరో జగన్‌కు తెలుసు!

అందుకే విచారణ నుంచి మహంతి తప్పుకొన్నారు

సీబీఐ డీఐజీ సుధాసింగ్‌ కూడా: బీటెక్‌ రవి 

పులివెందుల, ఆగస్టు 3: వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలుసని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. వందకు వందశాతం సీఎంకు తెలుసు కాబట్టే నాడు ఎస్పీగా ఉన్న అభిషేక్‌ మహంతి సెలవుపై వెళ్లారన్నా రు. అలాగే సీబీఐ డీఐజీ సుధాసింగ్‌ కూడా ఇలాంటి విచారణ చేయలేనని తనంతట తానే వెళ్లిపోయారని చెప్పారు. రంగయ్య స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం, సునీల్‌, దస్తగిరి పేర్లు బయటకురావడం 

Updated Date - 2021-08-04T08:48:00+05:30 IST