ప్రముఖ కమెడియన్ సునీల్ మరోసారి హీరోగా అలరించబోతున్నాడు. డిటెక్టివ్ రామకృష్ణగా తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. `కనబడుట లేదు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీమ్ ఓ పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్లో సునీల్ డిటెక్టివ్ లుక్లో కనిపించాడు. చీకట్లో టార్చ్ వేసి ఏదో వెతుకుతున్నాడు. ఈ సినిమాతో సునీల్ తనదైన వినోదాన్ని అందించబోతున్నట్టు తెలుస్తోంది.