May 6 2021 @ 13:49PM

కాంట్రవర్సియల్‌ తమిళ మూవీ రీమేక్‌లో సునీల్..?

రీసెంట్‌గా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'మండేలా'. కమెడియన్‌ యోగిబాబు ఇందులో టైటిల్‌ పాత్రను పోషించారు. పొలిటికల్‌ సెటైర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్‌లో కూడా శాటిలైట్‌, డిజిటల్‌ మాధ్యమాల్లోనే నేరుగా విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ముందుగా 'మండేలా' తెలుగు రీమేక్‌లో బండ్లగణేశ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ రీమేక్‌లో సునీల్‌ టైటిల్‌ పాత్రలో నటించబోతున్నారంటూ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలోనే 'మండేలా' తెలుగు రీమేక్‌ దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని టాక్‌. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.