Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నులపండువగా సుంకిశాల వేంకటేశ్వరుడి కల్యాణం

వలిగొండ, డిసెంబరు 2: వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో శ్రీవేంకటేశ్వరుడి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, యాదాద్రి దేవస్థానం తరపున వంశ పారంపర్య ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి అందజేశారు. ముత్యాల తలంబ్రాలు, మంగళ సూత్రాన్ని ఆలయ నిర్మాణ దాత డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి – సాధన దంపతుల తరపున వారి సోదరుడు పైళ్ల అచ్చి రెడ్డి దంపతులు అందజేశారు. కల్యాణాన్ని ఆరుణ్‌కుమారాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు సంతోష్‌కుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వ హించారు. కొవిడ్‌ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పైళ్ల సోదరులు రాజిరెడ్డి, సర్పంచ్‌ మొగిలిపాక నర్సింహ, ఆలయ చైర్మన్‌ పైళ్ల ఆనంద్‌ కుమార్‌రెడ్డి, పెద్దలు, బుచ్చిరెడ్డి, శాయిరెడ్డి, పైళ్ల మోహన్‌రెడ్డి, సహాయ కార్యనిర్వాహణాధికారి కృష్ణ, అర్చ కులు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పూజలు

భువనగిరి టౌన్‌: కార్తీక మాస పూజలను  భువనగిరిలో గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీపచ్చలకట్ట సోమేశ్వారాలయంలో సామూ హిక సత్యన్నారాయణ స్వామి వ్రతపూజలు ఆచరించారు. సోమేశ్వర స్వామి సహిత భువనేశ్వరి మాత కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ పూజారి కప్పగంతుల నాగరాజుశర్మ,  ఆలయ కమిటీ చైర్మన్‌ కాలేరు లక్ష్మణ్‌ మాజీ చెర్మన్‌ దేవరకొండ నర్సింహాచారి పర్యవేక్షణలో ఉత్సవాలు కొన సాగాయి. శ్రీహరిహర పుత్ర అయ్యప్పస్వామి ఆల యంలో దివ్యపడిపూజ భక్తి శ్రద్దలతో నిర్వహించారు. దక్షిణేశ్వరస్వామి మఠం, శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
Advertisement
Advertisement