May 7 2021 @ 00:11AM

వలస కార్మికులకు సన్నీ సాయం!

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ - పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా)తో కలిసి కొవిడ్‌ బాధితులను ఆదుకోవటానికి ముందుకు వచ్చారు. ఢిల్లీలో నివసిస్తున్న వలస కార్మికులకు పది వేల భోజనాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ‘‘వలస కార్మికులకు ప్రొటీన్‌ ఫుడ్‌ అవసరం. దీనిని అందించటానికి పెటాతో ముందుకు వస్తున్నా. మనం ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్నాం. దీనిని తట్టుకొని నిలబడాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి’’ అని ఆమె ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ముంబైలో వ్యాక్సిన్‌ వేయించుకున్న 102 ఏళ్ల షీలా తారకేశ్వర్‌ సిన్హా ఫోటోను - ‘‘షీ ఈజ్‌ ఇన్‌స్పిరేషన్‌’’ అనే శీర్షికన ట్యాగ్‌ చేశారు.