వార్నర్ కాదు.. ఇక విలియమ్సన్.. కఠిన నిర్ణయం తీసుకున్న రైజర్స్

ABN , First Publish Date - 2021-05-02T01:41:53+05:30 IST

వరుస ఓటములతో దారుణ ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు పడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాజాగా జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌తో వార్నర్‌పై..

వార్నర్ కాదు.. ఇక విలియమ్సన్.. కఠిన నిర్ణయం తీసుకున్న రైజర్స్

ఢిల్లీ: వరుస ఓటములతో దారుణ ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు పడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాజాగా జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌తో వార్నర్‌పై అభిమానుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. బెయిర్ స్టోను కాకుండా విలియమ్సన్‌తో సూపర్ ఓవర్ బ్యాటింగ్‌కు దిగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడినప్పటికీ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఇంత దారుణ ప్రదర్శన మరే జట్టూ చేయలేదు. దీంతో ఆ ఫ్రాంచైజీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. 


అందులో భాగంగా కఠిన నిర్ణయం తీసుకుంది. వార్నర్‌ను కెప్టెన్సీ తొలగించి విలియమ్సన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. అయితే కెప్టెన్సీ నుంచి తొలగించిన మాత్రాన వార్నర్‌పై తమకు గౌరవం లేదని, కాదని అతడి సేవలను ఎప్పటికీ మర్చిపోమని చెప్పుకొ్చ్చింది. రాజస్థాన్ మ్యాచ్ నుంచి విలియమ్సన్ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగబోతోంది. వార్నర్ జట్టు సభ్యుడిగా బరిలోకి దిగనున్నాడు.

Updated Date - 2021-05-02T01:41:53+05:30 IST