సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్ అవుట్

ABN , First Publish Date - 2021-04-15T04:06:00+05:30 IST

ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(54: 37 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ తరువాత ..

సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్ అవుట్

చెన్నై: ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(54: 37 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ తరువాత అవుటయ్యాడు. 14వ ఓవర్ వేసిన కైల్ జేమిసన్ విసిరిన ఓ స్లోబాల్‌ను లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన వార్నర్.. అక్కడ డానియల్ క్రిస్టియన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 13.2 ఓవర్లకు సన్‌రైజర్స్ 2 వికెట్లకు 96 పరుగులు చేసింది. మనీష్ పాండే(33: 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు), జానీ బెయిర్ స్టో(0) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-04-15T04:06:00+05:30 IST