Advertisement
Advertisement
Abn logo
Advertisement

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా.. కేకేఆర్ జట్టు 12 సార్లు గెలిచి లీడ్‌లో ఉంది. ఎస్ఆర్‌హెచ్ కేవలం 7 సార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. మరి ఈ మ్యచ్‌లో కూడా గెలిచి కేకేఆర్ లీడ్ కొనసాగిస్తుందా..? లేక ఎస్ఆర్‌హెచ్ విజయంతో బోణీ కొడుతుందా వేచి చూడాలి. 


Advertisement
Advertisement