పవర్ ప్లేలో రైజర్స్ అదుర్స్.. ఒక్క వికెట్ కోల్పోకుండా..

ABN , First Publish Date - 2021-04-18T03:30:47+05:30 IST

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓపెనర్లు అదరగొట్టారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా..

పవర్ ప్లేలో రైజర్స్ అదుర్స్.. ఒక్క వికెట్ కోల్పోకుండా..

చెన్నై: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓపెనర్లు అదరగొట్టారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 57 పరుగులు చేశారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో(41: 18 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీల వర్షం కురిపించాడు. ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను టార్గెట్ చేసుకున్న బెయిర్ స్టో ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో బౌల్ట్ 2 ఓవర్లలోనే 20 పరుగులు సమర్పించుకున్నాడు. అతడికి డేవిడ్ వార్నర్(15: 18 బంతుల్లో.. 2 ఫోర్లు) మరో ఎండ్‌లో చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇదే సమయానికి ముంబై జట్టు కూడా 53 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.

Updated Date - 2021-04-18T03:30:47+05:30 IST