నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, రాకేందు మౌళి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'సూపర్ ఓవర్'. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ వర్మ దివంగతుడయ్యారు. సుధీర్ వర్మ నిర్మాత. ఈ చిత్రం జనవరి 22న ఆహాలో విడుదలవుతుంది. 'సూపర్ ఓవర్' స్నీక్‌పీక్‌ను శనివారం యువ కథానాయకుడు శర్వానంద్ విడుదల చేశాడు. రీసెంట్గా ఆహాలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన 'మెయిల్' సినిమాతో పాటు 'మా వింతగాథ వినుమా, కలర్‌ఫొటో, ఒరేయ్ బుజ్జిగా' వంటి సూపర్‌హిట్ చిత్రాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా చేసిన 'సామ్‌జామ్' టాక్ షో, హర్ష చెముడు చేసిన కామెడీ షో 'తమాషా' వంటి కార్యక్రమాలు తెలుగు వారిని అలరించాయి.
'సూపర్ ఓవర్' సినిమాను డెబ్యూ డైరెక్టర్ ప్రవీణ్ వర్మ తెరకెక్కించగా, సుధీర్ వర్మ నిర్మించారు. థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం స్నీక్‌పీక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన శర్వానంద్ ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.