వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-12-05T00:27:16+05:30 IST

జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కర్మాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీ ఓ జారీ చేసింది

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల నిధులు

వరంగల్: జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కరాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ  ప్రభుత్వం శనివారం జీ ఓ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ జీ ఓ 158 ని జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టీఎస్ఎంఎస్ఐడిసి  డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వి ఆ జీ ఓ లో అదేశించారు.

 

ఇదిలా ఉండగా, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో సీఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం శంకు స్థాపన చేయడమే గాక, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం వల్ల పనులు మరింత వేగం కాగలవని ఆశిస్తూ, మంత్రి హరీష్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. 


వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి అయితే, హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం, ఇక్కడే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుందని చెప్పారు. సీఎం కేసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసిఆర్ దని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Updated Date - 2021-12-05T00:27:16+05:30 IST