Apr 11 2021 @ 08:03AM

'వకీల్‌సాబ్‌'కు మహేశ్‌ ప్రశంసలు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పవర్‌ ప్యాక్‌డ్‌ మూవీ 'వకీల్‌సాబ్‌'. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ సునామీని క్రియేట్‌ చేస్తోంది. తొలి రోజున రూ.36.46 కోట్ల షేర్‌ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవి, చరణ్‌ సహా  సినీ సెలబ్రిటీలందరూ సినిమా చాలా బావుందంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో సూపర్‌స్టార్‌ మహేశ్‌ కూడా చేరారు. "'వకీల్‌సాబ్‌'లో టాప్‌ ఫామ్‌లో పవర్‌ ప్యాక్‌డ్‌ పెర్ఫామెన్స్‌ చేశారు. ఎంతో గొప్ప కమ్‌బ్యాక్‌. ప్రకాష్‌రాజ్‌గారు బ్రిలియంట్‌. నివేతా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల.. హార్ట్‌ టచ్‌ పెర్ఫామెన్స్‌ చేశారు. థమన్‌ టాప్‌ రేంజ్‌ మ్యూజిక్‌ను అందించాడు. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు" అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.