Apr 11 2021 @ 13:10PM

అడివి శేష్‌ కోసం ముగ్గురు సూపర్‌స్టార్స్‌

అడివిశేష్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మేజర్‌'. సోనీ పిక్చర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ పతాకాలపై సినిమా నిర్మితమవుతుంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఆఫీసర్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 2న ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 12న సాయంత్రి 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను ముగ్గురు సూపర్‌స్టార్స్‌ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌, హిందీలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్, మలయాళంలో అగ్ర హీరో పృథ్వీరాజ్‌ సోమవారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తారు. సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాళ, ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.