సూపర్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2021-06-19T05:42:31+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌, దొడ్ల డెయిరీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లకు మార్కెట్లో అపూర్వ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ రెండు పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులు

సూపర్‌ సక్సెస్‌

తెలుగు కంపెనీల ఐపీఓలకు అపూర్వ స్పందన

దొడ్ల డెయిరీ ఇష్యూకు 45.61 రెట్ల బిడ్లు  

కిమ్స్‌ ఇష్యూకు 3.86 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌


ముంబై: హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌, దొడ్ల డెయిరీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లకు మార్కెట్లో అపూర్వ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ రెండు పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దాంతో దొడ్ల డెయిరీ ఇష్యూకు ఏకంగా 45.62 రెట్ల బిడ్లు వచ్చాయి. కిమ్స్‌ ఇష్యూకు సైతం 3.86 రెట్ల బిడ్లు లభించాయి. రూ.2,144 కోట్ల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కిమ్స్‌ 1,44,13,073 ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా.. మొత్తం 5,56,55,046 షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) వెల్లడించింది. రూ.520 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన దొడ్ల డెయిరీ 85,07,569 షేర్లను అమ్మకానికి పెట్టగా.. 38,80,64,950 షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. ఈ రెండు కంపెనీల షేర్లు బీఎస్‌ఈతో పాటు ఎన్‌ఎస్‌ఈలోనూ లిస్ట్‌ కానున్నాయి. 


కిమ్స్‌ 

సబ్‌స్ర్కిప్షన్‌ విభాగాల వారీగా.. (రెట్లలో)

క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ 

(క్యూఐబీ): 5.26 

నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌: 1.89

రిటైల్‌ ఇన్వెస్టర్లు: 2.89

కంపెనీ ఉద్యోగులు: 1.06


దొడ్ల డెయిరీ 

క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ 

 (క్యూఐబీ): 84.88

నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌: 73.26

రిటైల్‌ ఇన్వెస్టర్లు: 11.33


23 నుంచి ఇండియా పెస్టిసైడ్స్‌ ఐపీఓ 

ఇష్యూ ధర శ్రేణి రూ.290-296

ఆగ్రోకెమికల్‌ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్‌ ఐపీఓకు రానుంది. ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనున్న పబ్లిక్‌ ఇష్యూ ధర శ్రేణిని రూ.290-296గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Updated Date - 2021-06-19T05:42:31+05:30 IST