Abn logo
May 25 2020 @ 18:46PM

‘భానుమ‌తి రామ‌కృష్ణ’ ట్రైల‌ర్‌కు మంచి స్పందన

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న నటుడు న‌వీన్ చంద్ర. ఆయన హీరోగా తెర‌కెక్కిన సినిమా ‘భానుమ‌తి రామ‌కృష్ణ’‌. ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్‌గా ‘భానుమ‌తి రామ‌కృష్ణ’‌ను రూపొందించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. న్యాచురాలిటీ కోసం ఈ సినిమాలో కీల‌క స‌న్నివేశాల్ని గొరిల్లా ప‌ద్ధ‌తిలో షూట్ చేసినట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే తెలిపింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్‌కు ఆన్‌లైన్‌లో చాలా మంచి ఆద‌ర‌ణ ల‌భించిందని, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని చిత్రయూనిట్ తెలిపింది. 


ముప్పై ఏళ్లు దాటిన ఓ యువ‌తీ యువ‌కుడు మ‌ధ్య జ‌రిగే ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ సినిమాకు ముఖ్య క‌థాంశ‌మ‌ని ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి తెలిపారు. ఫుల్‌ ఎంట‌ర్‌టైనింగ్‌గా డిజిటిల్ ఆడియెన్స్‌కి న‌చ్చే రీతిన ఈ సినిమా సాగిపోతుంద‌ని నిర్మాత య‌శ్వంత్ ముల‌కుట్ల అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని య‌శ్వంత్ తెలిపారు. న‌వీన్ చంద్ర‌, స‌లోని లూత్రా, హార్ష త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వ‌ాజ్ సంగీతం అందించగా రవికాంత్ పేరేపు ఎడిటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. సాయిప్ర‌కాశ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Advertisement
Advertisement
Advertisement