Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘జీవన్ సాథి డాట్ కామ్‌’ ప్రచార కర్తగా సూపర్ స్టార్ మహేశ్ బాబు

హైదరాబాద్: ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్, జీవన్‌సాథి డాట్ కామ్, #వి మ్యాచ్ బెటర్[#WeMatchBetter] ప్రచారానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సహకారం అందిస్తున్నారు. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత చేరువయ్యేందుకు మహేష్ బాబును ప్రత్యేక ప్రచారకర్తగా జీవన్ సాథి డాట్ కామ్ ఎంపిక చేసుకుంది. కోసం వారి సంప్రదాయాలు, సంస్కృతులను పరిగణలోకి తీసుకుని మంచి భాగస్వామిని వెతికిపెట్టేందుకు జీవన్ సాథి డాట్ కామ్ గొప్పగా ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది. ఈ క్రమంలోనే జీవన్ సాథి డాట్ కామ్ కోసం మహేష్ బాబు చేసిన ఓ మీడియా ప్రకటనను విడుదల చేసింది. కుమార్తెకు చక్కటి వరుడిని ఎంపిక చేసి వివాహం చేయాలనుకునే ఓ తండ్రికి జీవన్ సాథి డాట్ కామ్‌ను పరిచయం చేసి ఆయన ఆందోళనను మహేష్ బాబు తీరుస్తారు. ఈ విధంగా తమ వెబ్ సైట్ ద్వారా అనుకూలమైన వివాహ సంబంధాలకు జీవన్ సాథి డాట్ కామ్ దోహదపడుతుందని యాజమాన్యం వివరించింది.


Advertisement
Advertisement