Abn logo
Jun 3 2021 @ 12:07PM

మద్యం దుకాణంలో సూపర్‌వైజర్ చేతివాటం..

చిత్తూరు: పాలసముద్రం మండలం గంగమాంబపురం మద్యం దుకాణంలో పనిచేసే సూపర్‌వైజర్, సేల్స్ మెన్‌లు కలిసి పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించారు. దాదాపు రూ.16 లక్షలు కాజేశారు. తమిళనాడులో లాక్ డౌన్ వల్ల అక్కడ మద్యం దుకాణాలు మూత పడ్డాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న గంగమాంబపురం మద్యం దుకాణంలో రోజుకు రూ.5 నుంచి రూ.10 లక్షల వ్యాపారం జరిగింది. అయితే లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. రూ.16 లక్షలు తేడా వచ్చినట్టు గుర్తించారు. దీనికి కారకులుగా భావిస్తూ సూపర్‌వైజర్, సేల్స్ మెన్‌లిద్దరిని ఎక్సైజ్ అధికారులు పాలసముద్రం పోలీసులకు అప్పగించారు.

క్రైమ్ మరిన్ని...