తగినన్ని టీకాలు పంపండి, ఖర్చు మేం భరిస్తాం: మమతా

ABN , First Publish Date - 2021-01-16T22:43:48+05:30 IST

శనివారం దేశ వ్యాప్తంగా కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైంది. వర్చువల్‌ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

తగినన్ని టీకాలు పంపండి, ఖర్చు మేం భరిస్తాం: మమతా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తగినన్ని కోవిడ్-19 టీకాలు పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. కేవలం అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి టీకా అందించాలని, దానికి ఏమైనా ఖర్చు అయితే తాము భరిస్తామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు విలువైనవేనని, ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్-19 టీకా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మమతా బెనర్జీ అన్నారు.


శనివారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రానికి సరిపడా కోవిడ్-19 టీకాలను పంపించండి. అత్యవసర సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత టీకా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరి ప్రాణాలు విలువైనవే. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత టీకా వేసే విషయంలో అవసరమైన ఖర్చుల్ని మేము భరతిస్తాం’’ అని అన్నారు. శనివారం దేశ వ్యాప్తంగా కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైంది. వర్చువల్‌ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

Updated Date - 2021-01-16T22:43:48+05:30 IST