జీడి రైతులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-08-11T10:04:20+05:30 IST

జిల్లాలో జీడి పంటకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ కోర్‌ కమిటీ ..

జీడి రైతులను ఆదుకోండి

పలాస/వజ్రపుకొత్తూరు, ఆగస్టు 10: జిల్లాలో జీడి పంటకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం కోరారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా జీడి రైతులకు పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. తితలీ తుఫానుకు చెట్లన్నీ ధ్వంసం కాగా.. మిగిలిన మొక్కల నుంచి దిగుబడి అంతంత మాత్రంగా వచ్చిందన్నారు. 80 కిలోల బస్తా రూ.12 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేసి వ్యాపారులకు సబ్సిడీపై ఇచ్చి ఉంటే అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేదన్నారు. ఇకనైనా జీడి రైతులకు న్యాయం చేయా లని లేకుంటే రైతుల పక్షాన నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.  జనసేన నాయకుడు హరీష్‌కుమార్‌ శ్రీకాంత్‌ ఉన్నారు.


జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

హరిపురం: ప్రభుత్వం ప్రకటించిన 80 కిలోల జీడి పిక్కల బస్తాను రూ.10 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్‌, మామిడి మాధవరావు కోరారు. హరిపురంలో సోమవారం వారు మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది వ్యాపారులు, దళారీలు గ్రామాల్లో తిరుగుతూ 80 కిలోల బస్తాను రూ.9 వేలు చెల్లిస్తామని, మరో వెయ్యి ప్రభుత్వం తమ ఖాతాల్లో జమచేస్తే చెల్లిస్తామని రైతులను మోసగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కమిటీ సభ్యులు గొర్లె చలపతిరావు, కర్రి తిరుపతిరావు, రామారావు, నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:04:20+05:30 IST