మిర్చి రైతులను ఆదుకోవాలి : జూలకంటి

ABN , First Publish Date - 2022-01-19T05:53:01+05:30 IST

అకాల వర్షాలకు, తెగుళ్లతో రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో మి ర్చిపంటకు నష్టం వాటిల్లిందని, రైతు లకు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మం

మిర్చి రైతులను ఆదుకోవాలి : జూలకంటి
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ, జనవరి 18: అకాల వర్షాలకు, తెగుళ్లతో రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో మి ర్చిపంటకు నష్టం వాటిల్లిందని, రైతు లకు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 20వేల ఎకరాల్లో మిర్చి పంటకు తామర, బూడిద తెగులు సోకి దిగుబడి పడిపోయిందన్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఒక్కో రైతు 8 నుంచి 10 సార్లు పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఈ నెల22 నుంచి 25 వరకు జరిగే సీపీఎం 3వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రాంమూర్తి, రవినాయక్‌, వినోద్‌నాయక్‌, బాబునాయక్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:53:01+05:30 IST