Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కాంగ్రెస్‌ నాయకులు... జేడీ కార్యాలయం ముట్టడి 

అనంతపురం రైల్వే, డిసెంబరు3: జిల్లాలో భారీ వర్షాలకు పంట లు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాం డ్‌ చేశారు. శుక్రవారం వారు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. జేడీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇటు ఖరీ్‌ఫలో వేరు శనగ, అటు రబీలో వేసిన వివిధ రకాల పంటలకు అపారమైన నష్టం జరిగిందన్నారు. నష్టాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రతి రైతుకు తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో జరిగిన పంటల నష్టానికి, అధికారులు చెపుతున్న లెక్కలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. అనంతరం జేడీని కలిసి పలు స మస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. జేడీ మాట్లాడుతూ రైతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూ స్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు శంకర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్‌ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వాసు, ఉరవకొండ ఇనచార్జ్‌ రవికృప రామానాయుడు, తాడిపత్రి ఇనచార్జ్‌ సూర్య నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫకృద్దీన, ఎనఎ్‌సయూఐ నాయకులు నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement