కందులకు మద్దతు పెంపు

ABN , First Publish Date - 2020-06-04T09:11:41+05:30 IST

వికారాబాద్‌ జిల్లా తాండూరులో కందులను అధికంగా పండిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కంది పంటకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది.

కందులకు మద్దతు పెంపు

కేంద్ర తాజా నిర్ణయంతో రూ.200లు పెరిగిన ధర

ఎంఎస్‌పీ పెరగడంతో పత్తి, కందులకు కలిసి రానున్న మద్దతు

అత్యధికంగా మినుములకు పెంపు, స్వల్పంగా జొన్నకు పెంపు


తాండూరు : వికారాబాద్‌ జిల్లా తాండూరులో కందులను అధికంగా పండిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కంది పంటకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వరి, పత్తి, కంది, పంటలకు కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పీ) పెంచినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించిన విషయం విధితమే. కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌, ప్రైసెస్‌ రెకమండేషన్ల ఆధారంగా ఎంఎస్‌పీలను పెంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో క్వింటా లుకు రూ.5,800 ఉన్న కందుల మద్దతు ధరను ఈ ఏడాది రూ.6,000లకు పెంచారు. దీంతో గతేడా దితో పోలిస్తే ఈ ఏడాది రూ.200 అధికంగా పెరిగింది. సాగు విస్తీర్ణం పెంచే దశలో మద్దతు ధర పెరగడం రైతులకు ఊరటనిచ్చింది. కంది సాగు కూడా రెండింతలు పెరుగుతున్న నేపథ్యంలో క్విం టాలుకు రూ.200ల వరకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది.


ఎంఎస్‌పీల పెరుగుదలతో ప్రధానంగా వరి, పత్తి, కంది పంటలకు లాభం కలిగే అవకాశం ఉంది. ఏ-గ్రేడ్‌ వరికి గతేడాది మద్దతు ధర రూ.1,835లు ఉండగా, ఈసారి రూ.53లకు పెరిగి రూ.1,888కు చేరింది. సాధారణ వరి సాగుకు ధర రూ.1815 నుంచి రూ.1868లకు పెరిగింది. గతంతో కంటే ఈసారి పత్తి సాగు పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన నేపథ్యంలో, తాజాగా కేంద్రం ప్రకటన కలిసిరానుంది. పొడుగురకం పత్తిపై రూ.275, సాధారణ రకం పత్తిపై రూ.260 అదనపు ప్రయోజనం చేకూరింది.


జొన్నకు గతేడాది రూ.2,550 ఉండగా, ఈఏడాది రూ.2,620కి పెంచడంతో రూ.70 పెరిగింది. మినుములకు గతేడాది రూ.5,700లు ఉండగా, ఈ ఏడాది రూ.6,000కు పెరిగింది. దీంతో అదనంగా రూ.300 పెరిగినట్ల య్యింది. అన్నిటికంటే మినుములకు మద్దతు ధర అధికంగా పెరగగా, జొన్నకు తక్కువ పెరిగింది.      

Updated Date - 2020-06-04T09:11:41+05:30 IST