మొక్క జొన్న రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-01-21T04:53:35+05:30 IST

మండల వ్యాప్తంగా సాగు చేసి పంట దెబ్బతిన్న మొక్కజొన్న రైతుల ను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మొక్క జొన్న రైతులను ఆదుకోవాలి
మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

 దెబ్బతిన ్న పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దువ్వూరు, జనవరి 20:  మండల వ్యాప్తంగా సాగు చేసి పంట దెబ్బతిన్న  మొక్కజొన్న రైతుల ను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.  గురువారం ఇడమడక గ్రామంలో సాగు చేసిన హైబ్రిడ్‌ మొక్కజొన్న పంటలను తిరుపతికి చెందిన శాస్త్రవేత్త హేమంత్‌కుమార్‌, కడపకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పద్మోదయలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో పంట సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విత్తనాల మొలక శాతం, అధిక వర్షపాతం, గాలితో అధిక తేమ, భూమి స్వభావాలను సేకరించారు. ల్యాబ్‌లో పరిశీలించి మూడు రోజుల్లో నివేదికలు సిద్ధం చేస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీదారులు రైతులకు మేలు జరిగేలా ఆలోచించాలని దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయ సలహాదారుల సంఘం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు హైబ్రిడ్‌ మొక్కజొన్న కంపెనీదారుడు ఆలోచించాలని  ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్‌ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T04:53:35+05:30 IST