పంటలకు మద్దతు ధర కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-18T05:18:17+05:30 IST

రైతులు పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు కోటేశ్వర్‌రావు అన్నారు.

పంటలకు మద్దతు ధర కల్పించాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన్‌ 17:  రైతులు పండించిన పంటలకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు కోటేశ్వర్‌రావు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి రూ.1960, పత్తికి రూ.6025 మద్దతు ధర ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని, కానీ ప్రస్తుతం ఎరువులకు, పురుగుల రసాయనాలకు, రోజువారి కూలీలకు 35 శాతం నుంచి 58 శాతం అధికంగా ఖర్చులు పెరిగాయన్నారు. మద్దతు ధర మాత్రం కేవలం నాలుగు శాతమే పెరగడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ రుణప్రణాళిక ప్రకటించకపోవడంతో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. రైతుబీమా వయస్సు 75 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు విక్రయించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 13 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మండారి డేవిడ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్‌, నాయకులు కాకిమోహన్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, వెంకన్న, సైదులు, అంజయ్య, సత్యం, ముత్తయ్య, నాగయ్య, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:18:17+05:30 IST