ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-01-22T05:29:06+05:30 IST

అప్పులు తెచ్చి వ్యవసాయం చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుంటుంబాలను ప్రభుత్వం ఆదుకోవా లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

పామూరు, జనవరి 21: అప్పులు తెచ్చి వ్యవసాయం చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుంటుంబాలను ప్రభుత్వం ఆదుకోవా లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని పాత ఇనిమెర్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఒంటిపెంట లక్ష్మీనరసయ్య, వెంకటలక్ష్మమ్మల కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి పిల ్లలతో మాట్లాడారు. గ్రామంలోని భూములన్నీ చుక్కల భూమిగా రికార్డులో నమోదయ్యాయని,  కుటుంబ, వ్యవసాయ అవసరాలకు సైతం వాటిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని  రైతులు ఎద్దుల నమ్మయ్య, దుగ్గిరెడ్డి బాలకృష్ణారెడ్డి, మందాడి మాలకొండయ్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక  గ్రామ కమిటీల తీర్మానం ద్వారా చుక్కల భూములను తొలగించే అధికారం రెవెన్యూ అధికారులకు ఉందని, అందుకోసం రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని, తమపార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వెంట సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాలి వెంకటరామిరెడ్డి, పిల్లి తిప్పారెడ్డిల ఉన్నారు. 


Updated Date - 2022-01-22T05:29:06+05:30 IST