భావ ప్రకటన దేశద్రోహమెలా అవుతుంది?: సుప్రీం

ABN , First Publish Date - 2021-03-04T07:25:11+05:30 IST

ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా భావ ప్రకటన చేస్తే దేశద్రోహం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లాపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ దాఖలైన ఓ ప్రజాహి త వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం

భావ ప్రకటన దేశద్రోహమెలా అవుతుంది?: సుప్రీం

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా భావ ప్రకటన చేస్తే దేశద్రోహం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లాపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ దాఖలైన ఓ ప్రజాహి త వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వగురు ఇండియా విజన్‌ ఆఫ్‌ సర్దార్‌ పటేల్‌ అనే సంస్థకు చెందిన రజత్‌ శర్మ, డాక్టర్‌ నేహ్‌ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్లకు రూ. 50వేల జరిమానా విధించింది.  

Updated Date - 2021-03-04T07:25:11+05:30 IST