ఆదిమూలపు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-09-16T00:30:55+05:30 IST

మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఆదిమూలపు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి: మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. కేసు నమోదుకు ముందే.. నిందితుల నివాసాల్లో సోదాలు జరిపి ఆధారాలు కూడా సేకరించినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. ఆధారాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆదిమూలపు దంపతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా విచారణ చేపట్టారని, అందుకే తెలంగాణ హైకోర్టు, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసినట్లు ఆదిమూలపు తరపు న్యాయవాది వివరించారు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టులో అసంపూర్తిగా వాదనలు ముగిశాయి. గురువారం కూడా సమయం ఇవ్వాలని ఆదిమూలపు సురేష్ తరపు న్యాయవాది, సుప్రీంకోర్టును కోరారు. విచారణను జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం  రేపటి వాయిదా వేసింది.

Updated Date - 2021-09-16T00:30:55+05:30 IST