మీడియా స్వీయ నియంత్రణపై సుప్రీంకోర్టు దృష్టి

ABN , First Publish Date - 2020-09-19T07:45:52+05:30 IST

మీడియా స్వీయ నియంత్రణపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ

మీడియా స్వీయ నియంత్రణపై సుప్రీంకోర్టు దృష్టి

సుదర్శన్‌ టీవీ ‘యూపీఎస్సీ జిహాద్‌’పై ధర్మాసనం విచారణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: మీడియా స్వీయ నియంత్రణపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) నుంచి సలహాలను కోరింది. సుదర్శన్‌ టీవీ చానల్‌లో ప్రసారమైన ‘యూపీఎస్సీ జిహాద్‌’ కథనాలపై దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ కేఎం జోసె్‌ఫలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ఈ కేసులో కేంద్రం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా, ఎన్‌బీఏ తరఫున నిషా భాంబనీ, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) తరఫున సీనియర్‌ లాయర్‌ ప్రీతేశ్‌ కపూర్‌ వాదనలు వినిపించారు. 


Updated Date - 2020-09-19T07:45:52+05:30 IST