అధికారులను జైలుకు పంపితే ఆక్సిజన్‌ రాదుగా?

ABN , First Publish Date - 2021-05-06T08:07:44+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరా అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆక్సిజన్‌ సరఫరాపై మాట తప్పినందుకు...

అధికారులను జైలుకు పంపితే ఆక్సిజన్‌ రాదుగా?

  • ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను నిలిపేసిన సుప్రీం

న్యూఢిల్లీ, మే 5 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరా అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆక్సిజన్‌ సరఫరాపై మాట తప్పినందుకు కేంద్ర అధికారులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. అధికారులను జైలుకు పంపడం వల్ల ఢిల్లీ నగరానికి ఆక్సిజన్‌ రాదని వ్యాఖ్యానించింది. దేశమంతా సంక్షోభంలో ఉన్న సమయంలో కోర్టులు సమస్యలు పరిష్కరించేదుకు పూనుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా అన్నారు. అయితే గురువారంకల్లా ఢిల్లీకి అవసరమైన 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఎలా సరఫరా చేస్తారో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.


Updated Date - 2021-05-06T08:07:44+05:30 IST