వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-03-30T19:26:48+05:30 IST

వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వలస కూలీలకు వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని  సుప్రీం కోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ పిటిషన్ వేశారు. దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వలస కూలీలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ రిపోర్ట్‌తో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ మంగళవారం నాటికి వాయిదా వేసింది. అయితే అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ కోరారు.

Updated Date - 2020-03-30T19:26:48+05:30 IST