అమెరికాలో ఆమె మరణశిక్షను నిలిపివేసిన కోర్టు

ABN , First Publish Date - 2021-01-13T14:43:17+05:30 IST

ఓ మహిళా ఖైదీ కి మంగళవారం అమలు చేయవలసిన మరణశిక్ష ను అమెరికా కోర్టు సరిగ్గా 24 గంటల ముందు నిలిపివేసింది.

అమెరికాలో ఆమె మరణశిక్షను నిలిపివేసిన కోర్టు

మిస్సన్‌(యూఎస్‌), జనవరి 12:  ఓ మహిళా ఖైదీ కి  మంగళవారం  అమలు చేయవలసిన మరణశిక్ష ను అమెరికా కోర్టు సరిగ్గా 24 గంటల ముందు నిలిపివేసింది. లిసా మోంట్‌గోమెరీ అనే మహిళ  2004లో మిస్సోరిలో 8 నెలల గర్భిణీని గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేసి, ఆమె పొట్టని కోసి నవజాత శిశువుని అపహరించుకువెళ్లింది. 2008లో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.


చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనందున ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదని మోంట్‌గోమెరీ న్యాయవాదులు కోర్టులో వాదించారు. దాంతో మరణశిక్ష అమలు చేయడానికి ముందు తప్పనిసరిగా ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించవలసి ఉందని కోర్టు తెలిపింది.  శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-01-13T14:43:17+05:30 IST