ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

ABN , First Publish Date - 2020-07-13T18:14:20+05:30 IST

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు ఇచ్చింది. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. గత 9ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తెరపడింది. 


కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం మేనేజ్‌మెంట్ వివాదంపై సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం.. గత ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.


ఆలయానికి సంబంధించిన సంపద, నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆలయంపై తమకు హక్కులు ఉంటాయని, భక్తులకే ఈ దేవాలయం చెందుతుందని పేర్కొంటూ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2020-07-13T18:14:20+05:30 IST