30-30-40 ఫార్ములాకు సుప్రీం పచ్చజెండా

ABN , First Publish Date - 2021-06-18T09:18:52+05:30 IST

బోర్డు పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీ రూపొందించిన మార్కుల కేటాయింపు విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిం ది. 30-30-40 ఫార్ములా ప్రకారం 12వ తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షల రద్దు నిర్ణయంపై పునఃపరిశీలనకు ఇక అవకాశం లేదని స్పష్టం

30-30-40 ఫార్ములాకు సుప్రీం పచ్చజెండా

12వ తరగతికి మార్కుల కేటాయింపుపై స్పష్టత

జూలై 31లోగా సీబీఎస్‌ఈ, ఐఎస్‌ఈ ఫలితాలు


న్యూఢిల్లీ, జూన్‌ 17: బోర్డు పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీ రూపొందించిన మార్కుల కేటాయింపు విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిం ది. 30-30-40 ఫార్ములా ప్రకారం 12వ తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షల రద్దు నిర్ణయంపై పునఃపరిశీలనకు ఇక అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో 12వ తరగతి ఫైనల్‌ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. జూలై 31 లోగా ఫలితాలు ప్రకటిస్తామని ఆయా బోర్డులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఫలితాలపై విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కా రానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం బోర్డులకు సూచించింది. బోర్డు మార్కులపై సంతృ ప్తి చెందని విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని సీబీఎ్‌సఈ తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. మార్కుల కేటాయింపు విధానంపై వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. 


మార్కుల కేటాయింపు ఇలా..

12వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు విధానాన్ని సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డులు సుప్రీంకోర్టుకు సమర్పించాయి. 10, 11 తరగతుల మార్కులు, 12వ తరగతిలో యూనిట్‌, మిడ్‌ టర్మ్‌, ప్రీ-బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించింది. 30-30-40 ఫార్ములాను అనుసరించి 10, 11 తరగతుల మార్కులకు 30% చొప్పున వెయిటేజీ, 12వ తరగతి ఇంటర్నల్‌ పరీక్షలకు 40% వెయిటేజీ ఇస్తూ 12వ తరగతి ఫైనల్‌ మార్కులు వెల్లడించనుంది. స్కూళ్లు పం పించే మార్కుల ఆధారంగా ప్రాక్టికల్‌ పరీక్షలకు మార్కులను కేటాయించనుంది. ఐఎస్‌సీ కూడా 12వ తరగతికి మార్కుల కేటాయింపు విధానాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... 1) 10వ తరగతి బోర్డు ఫలితాలు, 2) వివిధ సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌కు కేటాయించిన మార్కులు, 3) 11, 12 తరగతుల్లో స్కూలు స్థాయిలో విద్యార్థులు సాధించిన మార్కులు, 4) గత ఆరేళ్లలో సంబంధిత స్కూలు సాధించిన అత్యుత్తమ ఫలితాలను పరిగణనలోకి తీసుకొని 12వ తరగతి ఫైనల్‌ మార్కులు నిర్ణయిస్తామని పేర్కొంది. సీబీఎస్‌ఈ వెల్లడించిన మార్కుల కేటాయింపు విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 10, 11 తరగతుల మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు నిర్ణయించడం సరైన విధానం కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 10, 11, 12 తరగతుల పాఠ్యాంశాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయని, సీబీఎస్‌ఈ విధానం వల్ల ప్రతిభ గల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లదని మరికొందరు అంటున్నారు.

Updated Date - 2021-06-18T09:18:52+05:30 IST