పండుగ సందర్భంగా గోల్డ్ స్వీటు తయారీ...కిలో రూ.9వేలు

ABN , First Publish Date - 2020-10-31T13:17:40+05:30 IST

చండీ పద్వో పండుగ సందర్భంగా ఓ మిఠాయి దుకాణం యజమాని బంగారంతో కూడిన ప్రత్యేక స్వీటు....

పండుగ సందర్భంగా గోల్డ్ స్వీటు తయారీ...కిలో రూ.9వేలు

సూరత్ (గుజరాత్): చండీ పద్వో పండుగ సందర్భంగా ఓ మిఠాయి దుకాణం యజమాని బంగారంతో కూడిన ప్రత్యేక స్వీటు తయారు చేసి విక్రయిస్తున్న తీపి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగుచూసింది. చండీ పద్వో పండుగ సందర్భంగా సూరత్ నగరంలోని శరద్ పూర్ణిమ అనే స్వీటు షాపు యజమాని రోహాన్ బంగారంతో కూడిన గోల్డ్ ఘరీని తయారు చేశారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్లతో తయారు చేసే ఘరి కిలో 820 రూపాయలకు విక్రయిస్తుండగా అదులో 24 క్యారెట్ బంగారం కలిపిన గోల్డ్ ఘరీ ప్రత్యేక స్వీట్లను తయారు చేశారు. ఆయుర్వేదంలో బంగారం ప్రయోజనకరమైన లోహంగా పరిగణిస్తారని, అందువల్ల ఈ పండుగ కోసం తాము గోల్డ్ ఘరీని తయారు చేసి విక్రయానికి పెట్టామని స్వీటు దుకాణ యజమాని రోహాన్ చెప్పారు. ఈ గోల్డ్ ఘరీ కిలో ధర 9వేల రూపాయలుగా నిర్ణయించామని, మార్కెటులో దీనికి  డిమాండు తక్కువగానే ఉందని, కాని రాబోయే రోజుల్లో దీనికి డిమాండు పెరుగుతుందని రోహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-31T13:17:40+05:30 IST