హెలికాప్టర్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పారిశ్రామిక వేత్త

ABN , First Publish Date - 2021-02-18T03:42:35+05:30 IST

సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఓ పారిశ్రామిక వేత్త ఏకంగా హెలికాప్టర్‌లోనే స్వగ్రామానికి వెళ్లారు. ఈ ఘటన అహ్మద్ నగర్ తాలుకా...

హెలికాప్టర్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పారిశ్రామిక వేత్త

ముంబై: సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఓ పారిశ్రామిక వేత్త ఏకంగా హెలికాప్టర్‌లోనే స్వగ్రామానికి వెళ్లారు. ఈ ఘటన అహ్మద్ నగర్ తాలుకా అంబీదుమాలా గ్రామంలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన పారిశ్రామిక వేత్త జలిందర్ గగరె స్వగ్రామం అంబీదుమాలా గ్రామం. ఈ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో జలిందర్ సర్పంచ్‌గా గెలిచారు. వృత్యరీత్యా ఆయన పుణేలో ఉంటున్నారు. అయితే సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసేందుకు జలిందర్ ఏకంగా హెలికాప్టర్‌లో స్వగ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్తులను ఆశ్చర్యపర్చారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. అంతకుముందు హెలికాప్టర్‌లో నుంచే గ్రామంలోని ఆలయాలపై జలిందర్ పూల వర్షం కురిపించారు.

Updated Date - 2021-02-18T03:42:35+05:30 IST