పాస్‌పోర్టులపై నిఘా

ABN , First Publish Date - 2021-02-22T05:05:11+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ పాస్‌పోర్టుల కేసు వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర నిఘా ఏజెన్సీలు దృష్టి సారించాయి. బంగ్లాదేశ్‌ రోహింగ్యాలకు జిల్లా నుంచి పాస్‌పోర్టులు ఎలా మంజూరయ్యాయని రాష్ట్ర నిఘా ఏజెన్సీతో పాటు కేంద్ర ఏ జెన్సీలు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి.

పాస్‌పోర్టులపై నిఘా

కీలక మలుపులు తిరుగుతున్న రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం

ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారుల సస్పెన్షన్‌

ప్రత్యేక అధికారులతో దర్యాప్తు

డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎంపీ అర్వింద్‌ 

లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ పాస్‌పోర్టుల కేసు వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర నిఘా ఏజెన్సీలు దృష్టి సారించాయి.  బంగ్లాదేశ్‌ రోహింగ్యాలకు జిల్లా నుంచి పాస్‌పోర్టులు ఎలా మంజూరయ్యాయని రాష్ట్ర నిఘా ఏజెన్సీతో పాటు కేంద్ర ఏ జెన్సీలు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీ లకమైన ఇద్దరు పోలీసు అధికారులను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారుల బృ ందం గడిచిన రెండు రోజులుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. మరో వైపు రోహింగ్యాలకు సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై వేటు వేయాలని కోరుతున్నారు. 

ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా

రోహింగ్యాలకు జిల్లా నుంచి పాస్‌పోర్టులు మంజూరు కా వడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యాలు ఇతర  ప్రాంతాలకు వె ళ్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారు లు గత నెలలో పట్టుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ కు చెందినవారు కొన్నేళ్ల క్రితం పశ్చిమబెంగాల్‌కు వచ్చి అ క్కడి నుంచి బోధన్‌కు వచ్చినట్లు గుర్తించారు. పశ్చిమబెంగాల్‌లో ఆధార్‌కార్డు పొందిన వారు బోధన్‌లోని ఒక ఇంటి నుంచే ఆధార్‌ మార్పు చేయించుకుని పాస్‌పోర్టులు పొందినట్లు అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులైన అప్పటి ఇంటలిజెన్స్‌కు చెందిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐలను సస్పెండ్‌ చేశా రు. వారిద్దరి ద్వారా ఒకే ఇంటి నుంచి 70 వరకు పాస్‌పోర్టులు మంజూరైనట్లు గుర్తించారు. ఈ పాస్‌పోర్టులు 2014 నుంచి ఇప్పటి వరకు మంజూరైనట్లు అధికారుల దర్యాప్తు లో గుర్తించి వారిపైన వేటు వేశారు. 

పసిగట్టని ఎస్‌బీ అధికారులు

పాస్‌పోర్టు జారీచేసే సమయంలో పోలీసుశాఖకు చెంది న అధికారులు కీలక అంశాలన్నీ పరిశీలిస్తారు. ఆధార్‌, ఇత ర వివరాల ఆఽధారంగా విచారణ చేసి నివేదికను పంపిస్తా రు. ఆ నివేదిక ఆధారంగానే పాస్‌పోర్టులను జారీచేస్తారు. దాదాపు ఆరు సంవత్సరాల వ్యవధిలో ఒకే ఇంటి నంబర్‌ ఆ ధారంగా ఈ పాస్‌పోర్టులు జారీ అయినా ఎస్‌బీకి చెందిన ఇతర అధికారులు గుర్తించలేదు. రోహింగ్యాలకు జారీ అవు తున్నట్లు పసిగట్టలేదు. దర్యాప్తు చేస్తున్నవారు నివేదికలు పంపడం వల్ల జారీ చేశారు. ప్రతీ పాస్‌పోర్టుపైన ఎస్‌బీ అధికారులు స్పష్టంగా దృష్టిపెట్టాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవి జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకే ఇంటి నుంచి జారీ అయినా పట్టించుకోకపోవడం వల్ల 70 వరకు పాస్‌పోర్టులు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇల్లు కూడా ఓ పోలీసు అధికారికి సంబంధించినది కావడం తో ఎవరూ పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో భారీగా డ బ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. 

లోతుగా దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులు 

ప్రస్తుతం ఈ పాస్‌పోర్టుల వ్యవహారాన్ని పోలీసు శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహింగ్యాలకు పాస్‌పోర్టు జారీ అయిన విధంగానే ఇతరులకు కూడా జారీ అయితే.. తీవ్రవాదం గ్రూప్‌లు కూడా తీ సుకునే అవకాశం ఉంటుందని లోతుగా దర్యాప్తు చేస్తున్న ట్లు తెలుస్తోంది. బంగ్లాదేశీయులకు బోధన్‌లో ఎవరు సహకారం అందించారు? పశ్చిమబెంగాల్‌ నుంచి బోధన్‌కు ఎవ రు తీసుకువచ్చారు? వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తె లుస్తోంది. పాస్‌పోర్టుల వ్యవహారంలో ఎవరెవరు సహకరించారో ఆ వివరాలను తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కేం ద్ర నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన ట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్‌ నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చారనే అంశంపై వారు ఆరాతీసి నివేదిక పంపినట్లు తె లుస్తోంది. జిల్లాకు చెందిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పాస్‌పోర్టులు జారీ అయినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి అధికారులపైన కూ డా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపైన మాత్రం జిల్లాకు చెందిన పోలీస్‌ అధికారు లు ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రావడంలేదు. ప్ర భుత్వం సీరియస్‌గా ఉండడంతో అధికారులు నోరు మెదపడంలేదు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ కావడంతో ని జామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కూడా దర్యాప్తునకు ఆదేశించారు. ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు ఆ యన ఆధ్వ ర్యంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పాస్‌పోర్టుల జారీ సమయంలో ఇచ్చే నివేదికలను ప్రతినెలా స మీక్షించారా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు తె లుస్తోంది. ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎవరు స హకరించారు? వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎంపీ అర్వింద్‌

బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు జారీ అయిన వి షయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ పోలీ సు కమిషర్‌తో పాటు ఇతర అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇవి జారీ అయ్యాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన అఽధికారులందరిపై నా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్రవాదులకు కూడా అక్రమంగా పాస్‌పోర్టులు జారీ అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా జిల్లా నుంచి జారీ అయ్యే పాస్‌పోర్టుల వ్యవహారంలో దృష్టి సారించాలని కోరారు.  

Updated Date - 2021-02-22T05:05:11+05:30 IST