Abn logo
Apr 8 2020 @ 04:43AM

రైల్వే ఆస్తులపై డ్రోన్లతో నిఘా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్‌లో రైల్వే ఆస్తులపై డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యాన ప్రయాణికుల రైళ్లన్నీ ఆగిపోయాయి. కేవలం గూడ్సు రైళ్లు కొన్ని మాత్రమే తిరుగుతున్నాయి.


వీటన్నింటికి మాన్యువల్‌గా ప్రస్తుతం కాపలా కాయడం కష్టం అయినందున డ్రోన్లతో ఎక్కడ ఏమి జరుగుతున్నదీ తెలుసుకుంటున్నట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేవీ, విమానాశ్రయం అధికారులు అనుమతి తీసుకున్నామన్నారు. నిర్ణీత ఎత్తులో డ్రోన్‌ ఎగురుతూ ట్రాకులపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారు ఎవరైనా ఉంటే చిత్రీకరిస్తుందన్నారు. తీసిన వీడియో పుటేజీ మొత్తం లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామన్నారు.

Advertisement
Advertisement
Advertisement