Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెరువుల్లోకి లిఫ్ట్‌ కోసం సర్వే

మూసీ వాగు నుంచి ఏర్పాటు  - పరిశీలించిన అధికారులు 

మోత్కూరు, డిసెంబరు 1: మండలంలోని పొడిచేడు, దాచారం చె రువులను మూసీ వాగు నుంచి లిఫ్టుల ద్వారా నీటిని నింపేందుకు నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు. మూగు వాగులో ఎక్కడ మోటా ర్లు అమర్చాలి, చెరువుల్లోకి నీరు వెళ్లేందుకు కా ల్వల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. లిఫ్ట్‌ ద్వారా చెరువులు నింపేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, పొడిచేడు లిఫ్ట్‌ ఇరిగేషనకు రూ. 4కోట్లు, దాచారం లిఫ్ట్‌ ఇరిగేషనకు సుమారు రూ. 5 కోట్లు అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పీవీఎస్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. కార్యక్రమంలో ఈఈ కె.విజయకుమార్‌, డీఈ సత్యనారాయణ, ఏఈలు చంద్రశేఖర్‌, అమర్‌, సర్పంచులు మ ధు, అండెం రజితరాజిరెడ్డి, సింగిల్‌విండో వైస్‌ చైర్మన వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ వస్తాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement