Abn logo
Jun 17 2021 @ 00:47AM

ఆడెల్లి ఆలయ నిర్మాణ పనులకు సర్వే

నూతన పనులకు పరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు, ఆలయ సిబ్బంది

సుమారు 6.6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు

సారంగాపూర్‌, జూన్‌ 16 : మండలంలో గల ఆడెల్లి మహాపోచమ్మ దేవాలయం పురాతన ఆలయాన్ని తొలగించి నూతన ఆలయ నిర్మాణ పనులకు న్యాయ, పర్యావరణ, అ టవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదే శాల మేరకు బుధవారం హైదరాబాద్‌కు చెందిన ఇంజ నీర్‌ల బృందం సర్వేను నిర్వహించారు. ఈ ఆలయ నిర్మా ణం పనులకు రూ. 6 కోట్ల 60 లక్షలతో నూతన ఆలయ నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు ఆలయ పరిసరాలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, దుకాణాల సముదాయాల భవనాల నిర్మాణాలకు సర్వేను నిర్వహించారు. దీంతో పాటు ఆలయ పరిసరాలలో ఉన్నటువంటి ఆలయభూముల సర్వే లను నిర్వహించి ఆలయానికి చెందేలా సర్వేను నిర్వహించి ఆలయ భూములలో మొక్కలను నాటే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఈ సర్వే కార్యక్రమంలో మంత్రి అల్లోల సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహి పాల్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ ఐటీ చందు, దేవాదాయ ఏఈ రామారావు, ఆలయ ఈవో మహేష్‌, ఆడెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ మాధవ్‌రావు, ఆలయ సిబ్బందిలు ఉన్నారు.