Advertisement
Advertisement
Abn logo
Advertisement

బడిని బతికించండి..

పూర్వ విద్యార్థుల వేడుకోలు 

స్ర్టీట్‌ వెండర్‌ జోన్‌ పేరుతో ఆక్రమణకు కుట్ర 

దినదినం ఉనికి కోల్పోయే స్థితికి విద్యా కోవెల 

=================================

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా వందేళ్ల చరిత్ర ఆ బడిది. కానీ ఆ చరిత్రను చెరిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బడిలో ఆడుకున్న ఆ చిన్ననాటి రోజులు.. ఉపాధ్యాయులతో కలిసి గడిపిన ఆ మధుర జ్ఞాపకాలు కాలగర్భంలో కలిపేందుకు అడుగులు పడుతున్నాయి. ఘన చరిత్ర ఉన్న ఆ బడి స్థలంలో స్ర్టీట్‌ వెండర్‌ జోన్‌ పేరుతో షెడ్ల నిర్మాణానికి కాగితాలు కదులుతున్నాయి. అధికారుల తీరుతో పూర్వ విద్యారులు ఆందోళ న చెందుతున్నారు. ‘మా బడిని బతికించండి’.. అంటూ వేడుకుంటున్నారు. 

----------------------------------

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 3: కొందరి స్వార్థం వందేళ్ల చరిత్రకు శాపంగా మారనుంది. దిన దినం ఉనికిని కోల్పోతూ గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఆ బడిపై కొందరి కన్ను పడింది. స్ర్టీట్‌ వెండర్‌ జోన్‌ పేరుతో షెడ్ల నిర్మాణం చేపట్టి, తర్వాత ప్రలోభపర్వంతో ఆ షెడ్లను ఆక్రమించి, పాగా వేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరా దనే నిబంధనలు ఉన్నా, అవేవీ పట్టని పాలకులు పాఠశాల స్థలాన్ని, క మర్షియల్‌ కోటాలోకి మార్చే దిశగా కొందరు కుటిల యత్నాలు సాగిస్తు న్నారు. పట్టణ నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ గల ఈ భూమిని స్ర్టీట్‌ వెండర్‌ జోన్‌ కోసం సేకరించడంపై పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


వందేళ్ల చరిత్ర గల ఓల్డ్‌ హై స్కూల్‌

జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున, పాత బస్టాండ్‌ పక్కనే ఉన్న ప్రభుత్వ పురాతన (ఓల్డ్‌) పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. 1927వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాల ఎందరో విద్యార్థులను విద్య, వైద్య, ఇంజనీరింగ్‌, రాజకీయ తదితర రంగాల్లో  ఉత్తమ పౌరులుగా తీ ర్చిదిద్దింది. వేల మంది విద్యార్థుల భవిష్యత్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. క్రమ శిక్షణ, నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలిచిన ఈ పాఠశాల దుస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది.


ఇష్టారీతిన నిర్మాణాలు 

పాఠశాల స్థలంలో ఇష్టం వచ్చిన రీతిలో నిర్మాణాలను చేపడుతూ పా ఠశాల స్థలాన్ని కుంచింపజేస్తున్నారు. వివిధ నిర్మాణాల పేరిట స్థలాన్ని సేకరిస్తూ, పాఠశాల చరిత్రను సమాధి చేసేందుకే కొందరు కుట్రలకు తెరలేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం పాఠశాలకు 2.20ఎకరాల స్థలం ఉండగా, అందులో నుంచి స్ర్టీట్‌ వెండర్‌ జోన్‌ ఏర్పా టు కోసం సుమారు 50 షెడ్ల నిర్మాణం చేపట్టాలని బల్దియా నిర్ణయిం చింది. దీని కోసం గొల్లపెల్లి రోడ్డు, ధర్మపురి రోడ్డు కాంపౌండ్‌ వాల్‌ను కలిపి 652 గజాలు(5గుంటల 47 గజాలు) గల ఈ స్థలాన్ని  వినియో గించుకోవడానికి జగిత్యాల బల్దియా ప్రయత్నం చేస్తోంది. పాఠశాల స్థలాన్ని జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే షెడ్ల నిర్మాణం కోసం పాఠశాల భూమిని వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌ జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే లేఖ రాశారు. రోడ్డు విస్తరణలో భాగంగా సెట్‌బ్యాక్‌ పేరుతో చేపట్టిన కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణంతో పాఠశాలకు చెందిన కొంత స్థలం కుచిం చుకుపోయింది. దీనికి తోడు ఇదే పాఠశాల మైదానంలో ఎలాంటి అను మతులు లేకుండానే పట్టణ ప్రగతి నిధులు రూ.3లక్షలతో ట్రీ పార్క్‌ను సైతం ఏర్పాటు చేశారు. పాఠశాల ఆట స్థలంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ గురువు, పాఠశాల పూర్వహెడ్మాస్టర్‌ ముద్దు రామ కృష్ణయ్య విగ్రహం ఏర్పాటు చేయగా, అది ధ్వంసం అయ్యింది. ముద్ద రామకృష్ణయ్య పేరుతో ఏర్పాటు చేసిన లైబ్రరీ కూడా మరుగున పడింది.  ఇదే పురాతన పాఠశాలకు గత పాలకవర్గం అప్పటి బల్దియా చైర్‌పర్సన్‌ తాటిపర్తి విజయలక్ష్మి నాయకత్వంలో రూ.25లక్షల ఖర్చుతో రెన్నోవేషన్‌ పేరుతో భవనాన్ని ఆధునీకరించేందుకు ఆమోదం తెలిపింది. అప్పటి అధి కారుల నిర్లక్ష్యంతో ఆ పనులు ముందుకు సాగలేదని సమాచారం. 

 

పాఠశాల నిర్మాణంలో షెడ్ల నిర్మాణమా? 

జిల్లాలోనే అ ’పూర్వ’ ఘన చరిత్ర కలిగిన ఈ ఓల్డ్‌ హై స్కూల్‌ పాఠ శాల ఆవరణలో నిర్మాణం చేపట్టేందుకు బల్దియా అధికారులు ఇప్పటికే పాఠశాలకు వెళ్లి, సర్వే చేయించి, షెడ్ల నిర్మాణానికి 5గుంటల 47 గజాల స్థలాన్ని వినియోగించుకునేందుకు ప్లాన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు.  ప్లాన్‌ అమలుకు అనుమతులు ఇవ్వాలని, కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖకు లేఖ రాశారు. పాఠశాల స్థలంలో నిర్మాణం చేపట్టా లంటే హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనుమతు లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి అనుమతులు లేకుండానే ముందుకెళ్లడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో  పాఠశాల స్థలంలో నిర్మాణాలు చేపడితే, కూల్చివేసిన పరిస్థితులు ఉ న్నా, కలెక్టర్‌, బల్దియా అధికారులు పాలకవర్గం మొండిగా వ్యవహరిస్తూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుండడంపై పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సరికాదని, మా బడిని బతికించండంటూ పూర్వ విద్యార్థుల వేడుకుంటున్నారు. ఇదే విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామానుజంను వివరణ కోర గా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని తెలిపారు. మున్సిపల్‌ అధి కారులు సర్వే కోసం వచ్చారని, ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికా రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

 

చరిత్ర పునరావృతం కాకుండా ఉండేనా? 

గతంలో జగిత్యాల బల్దియా పరిధిలోని వ్యాపార సముదాయాల్లో బినా మీలు పాగా వేశారు. గడిచిన రెండు దశాబ్దాల క్రితం టెండర్లకు ఆహ్వా నించి, నిర్వహణ హక్కులు కల్పించిన బల్దియా యంత్రాంగం ఇప్పటి వరకు తిరిగి టెండర్లకు పిలవకపోవడంతో పాతవారే కొనసాగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొన్న కొందరు వ్యాపారులు తమ షాప్‌లను అద్దెకి స్తూ, అధికమొత్తంలో అద్దె వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మూడేళ్లకొకసారి దుకాణాలకు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా,  నేటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం నిర్మించే నిర్మాణాలకు అదే గతి పడితే అడిగేవారెవరిని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పాఠశాల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు

శ్రీపెల్లి రవీందర్‌, పూర్వ విద్యార్థి

ఘన చరిత్ర కలిగిన పురాతన (ఓల్డ్‌) ఉన్నత పాఠశాల మైదానంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదు. పాఠశాల స్థలం, పా ఠశాల అభివృద్ధికి వినియోగించాలి తప్ప, కమర్షియల్‌ నిర్మాణాలను కేటా యించవద్దు. పాఠశాల స్థలంలో కమర్షియల్‌ నిర్మాణాలు చేపట్టడాన్ని పూర్వ విద్యార్థిగా వ్యతిరేకిస్తున్న. ఉన్న స్థలాన్ని కాపాడుకుంటూ పాఠ శాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేలా చర్యలు చేపట్టాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాఠశాల స్థలాన్ని ఆక్ర మించుకోవడం, నిర్మాణాలు చేపట్టడం సరికాదు. ఈ నిర్ణయాన్ని బల్ది యా అధికారులు ఉపసంహరించుకోవాలి.   

ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి.

స్వరూపా రాణి , బల్దియా కమిషనర్‌ , జగిత్యాల

ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ జిల్లా విద్యా శాఖ అధికారికి లేఖ రాశారు. పాఠశాల స్థలం పురపాలక షెడ్ల నిర్మాణం కొరకు వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖద్వారా కోరడం జరి గింది. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు ఉన్న చోట నిర్మాణం చేపట్టవ చ్చుననే ఆదేఽశాల మేరకే ఈ ప్రతిపాదనలు ప్రారంభించాం. ఈ పనుల సర్వే గతంలో నేను రాకముందే అయిపోయింది. కానీ పాఠశాల స్థలంలో నిర్మాణ అనుమతుల కోసం ఇటీవలే కలెక్టర్‌కు నివేదించాం.  

 కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారు.

జగన్మోహన్‌ రెడ్డి, డీఈవో, జగిత్యాల 

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ పురాతన పాఠశాల ఆవరణలో షెడ్ల నిర్మాణం చేపట్టేందుకు కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారు. పాఠశాల స్థలం అప్పగించేందుకు విద్యాశాఖకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి లేఖ అందిం ది. ఈ లేఖను రాష్ట్ర హెచ్‌వోడీ, స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు జిల్లా విద్యా శాఖ తరుపున లేఖ రాశాం. హెచ్‌వోడీ సమాధానం కోసం ఎదు రుచూ స్తున్నం.


Advertisement
Advertisement