ఆలయ పునర్నిర్మాణ పనుల్లో బయటపడ్డ నటరాజస్వామి ప్రతిమలు

ABN , First Publish Date - 2021-10-18T06:32:43+05:30 IST

నారాయణవనం మండలం సముదాయం గ్రామ శివారులో టీటీడీ అనుబంధ ఆలయమైన అగస్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు జరుపుతుండగా భిన్నమైన నటరాజస్వామి, శివగామి అమ్మవార్ల లోహ విగ్రహాలు బయటపడ్డాయి.

ఆలయ పునర్నిర్మాణ పనుల్లో బయటపడ్డ   నటరాజస్వామి ప్రతిమలు
తవ్వకాల్లో బయటపడ్డ లోహ ప్రతిమలు

నారాయణవనం, అక్టోబరు 17: నారాయణవనం మండలం సముదాయం గ్రామ శివారులో టీటీడీ అనుబంధ ఆలయమైన అగస్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు జరుపుతుండగా భిన్నమైన నటరాజస్వామి, శివగామి అమ్మవార్ల లోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం టీటీడీ ఇంజనీరింగ్‌, ఆగమ విభాగాల అధికారులతో కలిసి తహసీల్దార్‌ మధుసూదన్‌, సముదాయం సర్పంచ్‌, గ్రామస్తులతో పంచనామా నిర్వహించి విగ్రహాలను స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో పార్వతికి అప్పగించారు. విగ్రహాలను స్థానిక పరాసురేశ్వర స్వామి ఆలయంలో భద్రపరచి తిరుపతికి తరలిస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2021-10-18T06:32:43+05:30 IST