Abn logo
Jul 7 2020 @ 13:02PM

మ‌రోసారి డ్యూయెల్ రోల్‌లో సూర్య‌?

హీరో సూర్య అంటే అటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. అందుక‌నే ఈయ‌న సినిమాలు రెండు భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల‌వుతుంటాయి. కథానుగుణంగా లుక్‌ను మార్చుకోవ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌ని సూర్య త్వ‌ర‌లోనే వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వాడివాస‌ల్’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఇందులో సూర్య ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ట‌. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో సూర్య తండ్రీ కొడుకులుగా న‌టిస్తార‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement