Abn logo
Sep 30 2020 @ 15:14PM

రాజకీయ నేతగా సూర్య ?

Kaakateeya

సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న తాజా తమిళ చిత్రంలో యువనటుడు సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. పాండిరాజ్‌ ‘వంశమ్‌’, ‘మెరీనా’, ‘కేడీ బిల్లా కిల్లాడి రంగా’, ‘కథకళి’, ‘ఇదు నమ్మ ఆళు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు  దర్శకత్వం వహించారు. ఇక హీరో సూర్య గతంలో ‘ఎన్‌జీకే’ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో మెప్పించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో వెరైటీ నటించనున్నారు.


Advertisement
Advertisement
Advertisement