Jun 25 2021 @ 04:20AM

శివతో సూర్య త్వరలో?

స్టూడియో గ్రీన్‌ పతాకంపై తమిళ హీరో సూర్య, దర్శకుడు శిరుతాయ్‌ శివ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని గతంలో ప్రకటించారు.  ‘సూరారై పొట్రు’ పూర్తవగానే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లాల్సి ఉండగా ఆ సమయంలో శివ రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ చిత్రంతో బిజీగా ఉండడంతో వీలు కాలేదు. అయితే ప్రస్తుతం ‘అన్నాత్తే’ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతో తదుపరి సూర్యతో చేయబోయే చిత్రంపైనే శివ కాన్సన్‌ట్రేషన్‌ చేస్తున్నారని సమాచారం. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం సెట్స్‌పై ఉంది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివసల్‌’ సినిమా చేయాల్సి ఉంది. సూర్య ఇవి రెండూ పూర్తి చేశాక శివ సినిమాను ప్రారంభిస్తారా లేదా సమాంతరంగా కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సోనీ లివ్‌ ఓటీటీ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరిందని సమాచారం.