Abn logo
Aug 10 2020 @ 20:39PM

`ఘర్షణ` సీక్వెల్‌కు సూర్య `నో`?

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన `కాక్క కాక్క` సినిమాతో  హీరో సూర్య తమిళనాట స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇదే సినిమాను తెలుగులో `ఘర్షణ` పేరిట వెంకటేష్ రీమేక్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నాడు. 


`కాక్క కాక్క` సీక్వెల్ చేస్తే తను తప్పకుండా నటిస్తానని తొలి భాగంలో నటించిన జ్యోతిక ఇటీవల స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అయితే సూర్య మాత్రం అందుకు సుముఖంగా లేడట. `కాక్క కాక్క` సీక్వెల్‌ లైన్‌ను ఇటీవల సూర్యకు గౌతమ్ వినిపించాడట. అయితే ఇప్పట్లో పోలీస్ పాత్రల్లో కనిపించే ఉద్దేశం తనకు లేదని సూర్య స్పష్టం చేశాడట. ఇంకొన్ని రోజులు ఆగుదామని చెప్పాడట. 

Advertisement
Advertisement
Advertisement