Abn logo
Jul 12 2021 @ 14:07PM

సూర్యాపేటలో నయీం అనుచరులమంటూ బెదిరింపులు

సూర్యాపేట: పట్టణంలోని అమ్మ గార్డెన్స్ సమీపంలో గల ఓ వెంచర్‌లో నయీమ్ అనుచరులమంటూ కొందరు వ్యక్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలోని ఇళ్ళు, నిర్మాణాలను నేలమట్టం చేశారు. తాము నయీమ్ అనుచరులమని, స్థలం తమదేనని బెదిరిస్తున్నారని  బాధితులు ఆరోపిస్తున్నారు. 200 గజాల చొప్పున  22 మంది బాధితులు ప్లాట్లు కొనుగోలు చేశారు. తమకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.