Abn logo
Aug 25 2021 @ 07:56AM

Suryapetలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద  శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంల్లో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.