Abn logo
Apr 2 2020 @ 13:49PM

యువకుడిని క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్న ముస్లిం మత పెద్దలు

సూర్యాపేట: చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడిని ఐసోలేషన్‌కు తరలిస్తుండగా ముస్లిం మత పెద్దలు అంబులెన్స్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. కరోనా పాజిటివ్ కానప్పటికీ క్వారంటైన్‌కు తరలించడం పట్ల ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం క్వారంటైన్ నుంచి నిన్న బషీర్ గ్రామానికి చేరుకున్నాడు. నిన్నటి నుంచి కూడా వైద్య పరీక్షలకు బషీర్ నిరాకరిస్తుండటం గమనార్హం. 


Advertisement
Advertisement
Advertisement