Abn logo
Jul 11 2021 @ 13:22PM

YSRCP ఎమ్మెల్యేను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

సూర్యాపేట: తెలంగాణ సరిహద్దు వద్ద జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఎమ్మెల్యే అనుచరుల నినాదాలు చేశారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే ఉదయ‌భాను మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన తమను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదేవిధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని ఉదయభాను హెచ్చరించారు.

క్రైమ్ మరిన్ని...